విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Mar 4, 2025 - 20:09
Mar 4, 2025 - 22:24
 0  2
 విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

ఖమ్మం  04 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి.రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకోవాలని సూచించారు.జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 9255 మంది విద్యార్థులు మరియు రెండవ సంవత్సరంలో 10003 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో మొత్తం 36 పరీక్ష కేంద్రాల లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, ఈ సంవత్సరం కొత్తగా ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల కొత్తగూడెంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు గాను చీఫ్ సూపర్డెంట్ అధికారులు 36 మంది అడిషనల్ చీఫ్ సూపర్డెంట్లు 13 మంది, డిపార్ట్మెంట్ అధికారులు 36 మంది, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు మూడు, కస్టోడియన్ అధికారులు 5 గురు, ఇన్విజిలేటర్లు 550 మంది మరియు 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు వైద్య సహాయం అందించడానికి గాను 72 మంది ఏఎన్ఎం లను నియమించినట్లు కలెక్టర్ తెలిపారు.విద్యార్థినీ విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333