విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే బాగా చదువుకోవాలి
విద్యార్థులకు అవసరమైన. వసతులు. మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం.
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే బాగా చదువుకోవాలని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ప్రతి విద్యార్థి. నిత్యం పాఠశాలకు హాజరై ఉన్నత స్థాయిలో చేరుకోవాలని వారు ఆకాంక్షించారు.
మంగళవారం పట్టణ శివారులోని రెండు పడక గదుల ఇండ్ల సముదాయం సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో కలెక్టర్ మాట్లాడారు. ఏకరూప దుస్తులు, రాత, పాఠ్య పుస్తకాలపై ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం వడ్డించాలని, రాగి జావ లేదా పాలు అందజేయాలని ఆదేశించారు. పాఠశాలలో తగినన్ని తరగతి గదులు ఉన్నందున సద్వినియోగం చేసుకునేలా విద్యార్థుల సంఖ్య పెరగాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉండడంతో ప్రతినిత్యం పిల్లలందరూ పాఠశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. పలువురు చిన్నారుల అభ్యసన సామర్ధ్యాలను తెలుసుకొని ప్రశంసించారు. విద్యార్థులు చక్కగా చదువుకొని తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.