విద్యార్థినీ విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేత.
ఇటిక్యాల సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ రఘువీరా.
జోగులాంబ గద్వాల 1జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సహించుటకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఇటిక్యాల బ్రాంచ్ మేనేజర్ రఘువీరా పాఠశాలను సందర్శించి విద్యార్థిని విద్యార్థులకు ప్రశంస పత్రాలను ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాగుంట తదితరులు ఉన్నారు.