విద్య,వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.... 

Jul 13, 2026 - 23:14
 0  1
విద్య,వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.... 

విద్య,వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ.... 
 ఈ నెల 27న కలెక్టరేట్ ముట్టడి,ధర్నాను విజయవంతం చెయ్యండి. 
 సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి 

సూర్యాపేట:ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్య రంగాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వాలు వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమి, తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదుల సమస్యలు, ప్రయోగశాలలు, గ్రంథాలయాల కొరత, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల లేమి వంటి అనేక సమస్యలు పేరుకుపోయినాయని అన్నారు.

అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలు, మందుల కొరత, పరీక్షల కోసం అవసరమైన పరికరాల లేమి, 24 గంటల వైద్య సేవలు అందకపోవడం, గర్భిణులు, చిన్నారులు, వృద్ధులకు సరైన వైద్య సేవలు అందకపోవడం వల్ల ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలపైసిపిఎం పార్టీ  ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు,  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమగ్ర సర్వే నిర్వహిస్తామన్నారు. సర్వేలో బయటపడిన సమస్యలను నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్‌కు సమర్పించి, వెంటనే పరిష్కరించాలని  డిమాండ్ చేస్తామన్నారు.

ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ వైద్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రజల పన్నుల డబ్బుతో నడిచే ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణకు ప్రోత్సాహం ఇవ్వడం ప్రజల హక్కులపై జరుగుతున్న దాడి అన్నారు. ఈ పరిస్థితిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు.ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బందిని నియమించాలని కోరారు. అన్ని రకాల మందులు, పరీక్షా పరికరాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.ప్రజలకు ఉచితంగా, నాణ్యమైన విద్యా,వైద్య సేవలను ప్రభుత్వం హామీ ఇవ్వాలని అన్నారు.ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్ ముందు నిర్వహించే ధర్నాలో ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333