విజ్ఞాన శాస్త్రంలో ప్రతిభను చాటుకున్న విద్యార్థులు
*విజ్ఞాన శాస్త్రంలో ప్రతిభను చాటుకున్న విద్యార్థులు*
విద్యార్థుల ప్రతిభకు వేదికగా విజన్ స్కూల్ మండల స్థాయి సైన్స్ ఫేర్.
-భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తాం.
పాఠశాల నిర్వాహకులు బాహుబలేంద్రుని వెంకటరామారావు
(నుగూరు)వెంకటాపురం, ఫిబ్రవరి 22 : తెలంగాణ వార్త
ములుగు జిల్లా
వెంకటాపురం మండల కేంద్రంలోని విజన్ స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం మండల స్థాయి సైన్స్ ఫేర్ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల నిర్వాహకులు బాహుబలేంద్రుని వెంకటరామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సైన్స్ ఫేర్‌లో వెంకటాపురం మండలానికి చెందిన విజన్ స్కూల్, విశ్వజ్యోతి స్కూల్, వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 450 మంది విద్యార్థులు 160 వినూత్న ప్రాజెక్టులతో తమ ప్రతిభను ప్రదర్శించారు.
విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వివిధ అంశాలపై సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలు, సామాజిక సమస్యలకు పరిష్కార మార్గాలు, పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రాజెక్టులు ప్రదర్శించారు.
ఈ ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
మండలంలోని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు సైన్స్ ఫేర్‌ను సందర్శించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా, సృజనాత్మకత మరియు పరిశోధనా దృక్పథాన్ని అభివృద్ధి చేస్తాయని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి శాస్త్రీయ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.ఈ సందర్భంగా సైన్స్ ఫేర్ విజయవంతం కావడానికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక ప్రజలకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలియచేశారు.