వాహనదారుల ప్రాణాలంటే లెక్కలేదా

ప్లెక్సీల నుంచి ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని గద్వాల మున్సిపల్ అధికారులు!
జోగులాంబ గద్వాల 8 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల. పట్టణ ప్రధాన రహదారిగుండా వెలసిన ప్లెక్సీలు గాలి దుమారానికి చిరిగిపోయి వేలాడుతున్నాయి. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులకు ప్లెక్సీలు తగిలి ప్రమాదాలకు గురవుతున్నారు. కాలం చెల్లిన ప్లెక్సీలను తొలగించి వాహనదారులు ప్రమాదాలకు గురికాకుండా చూడాలని వాహనదారుల విజ్ఞప్తి. సంబంధిత అధికారులు స్పందించి తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.