వార్తల సేకరణలో తెలంగాణ పత్రిక కు ప్రత్యేక స్థానం

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (ఐపీఎస్ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

Jan 31, 2025 - 20:20
Jan 31, 2025 - 20:21
 0  4
వార్తల సేకరణలో తెలంగాణ పత్రిక కు ప్రత్యేక స్థానం

తెలంగాణ వార్త జనవరి 31::- వాస్తవాలకు నిలువుటద్దం తెలంగాణ పత్రికని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అన్నారు.ఈ మేరకు శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ పత్రిక 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నిఖార్సైన వార్తలతో బడుగు,బలహీన వర్గాల పక్షాన 18వసంతాలుగా పోరాడుతున్న ఏకైక పత్రిక తెలంగాణ దినపత్రిక అని అన్నారు.పత్రిక ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ప్రజలకు ప్రభుత్వానికి వారది గా పని చేస్తూ సమాజ హితం కోసం పనిచేస్తున్న పత్రిక అని కొనియాడారు.రానున్న రోజుల్లో కూడా అదే తరహాలో పనిచేసి ప్రజా పక్షనా ప్రశ్నించే గొంతుకగానే ఉండాలని ఆకాక్షించారు. సమాజాన్ని మేల్కొలిపే వార్తలను అందిస్తున్న యాజమాన్యనానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ పత్రిక నల్గొండ జిల్లా బ్యూరో మేరుగు భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333