వామ్మో ఈ దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం....

ప్రహరీ గోడని ఆనుకొని మండల ఎంపీడీవో కార్యాలయం !
అసలే దోమల బెడద...
ప్రజలు రోగాల బారిన పడుతున్న పట్టించుకోరా..???
మురికి కాల్వ బాగు చేసేది ఎవరు..??
వివిధ పత్రికల్లో ప్రచురించిన ఫలితం లేదు...
అస్తవ్యస్తంగా మారిన అధికారుల వ్యవస్థ..!
తుంగతుర్తి 06 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త స్టాప్ రిపోర్టర్
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతున్న ప్రజాప్రతినిధులు గెలుస్తూ వస్తున్న అధికారులకు వచ్చి పోతున్న కానీ ఈ మురికి కాల్వ మరమ్మతులు చేపట్టడం లేదు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో మండల కేంద్రంలో పారిశుద్ధ్య లోపం ప్రజలకు శాపంగా మారింది చెత్త చెదారంతో వీధి కుక్కల బెడదతో పందుల విహారంతో మురుకు నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వెదజల్లుతుంది నాన్న అవస్థలు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు తుంగతుర్తి మండలం లోని వెంపటి రోడ్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది అదేవిధంగా రోడ్లపై మురికి నీరు నిలుస్తుండడంతో రోగాల బారిన పడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పారిశుద్ధ్య పనులు మురుగు కాలువల నిర్మాణం మరమతుల గురించి కూతవేటి దూరంలో ఉన్న ఎంపీడీవో కార్యాలయ ప్రహరి పక్కనే మురుగునీరు నిలిచిపోయిన అధికారులు మరియు సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్వం అదేవిధంగా ఎస్సీ కాలనీలో గత ప్రభుత్వం కట్టించిన రెండు పడకల గదులు నిరుపయోగంగా ఉండడంతో పందుల పెంపక దారులకు నివాసంగా మార్చారు సమీపంలోని మురికి కాలువలో పందుల స్వైర వివాహం చేస్తుండడంతో చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు దుర్వాసన వెదజల్లడంతో నివాసం ఉండలేకపోతున్నామని కనీసం అన్నం తినే పరిస్థితి లేదని తమ పిల్లలు అంటువ్యాధుల బారిన పడుతున్నామని తెలిపారు ఈ సమస్యపై పలుమార్లు పత్రికల్లో ప్రచురించిన అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి సమస్యను పరిష్కరించాలని తుంగతుర్తి ప్రజలు కోరుతున్నారు