వస్తుంది కొత్త ఏడాది 2026

Dec 31, 2025 - 20:54
 0  8
వస్తుంది కొత్త ఏడాది 2026

అడ్డగూడూరు 31 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– పోతుంది 2025 సంవత్సరకాలం వచ్చేది 2026 సంవత్సరం తేడా నెంబర్ ఒక్కటే అన్నది నిజం పోయింది కొందరికి మంచి కాలం మరికొందరిని ముంచిన సమయం మంచి చెడులమధ్య జరిగిన సమరం మరి నెంబర్ మారితె బ్రతుకులు మారెనా భవిష్యత్ గాడిన పడెనా ఒకరికి వయసు పెరుగుతుంది. మరొకరికి ఆయుష్ తరుగుతుంది.ఆ తేడా మాత్రం కనబడుతుంది. మధ్య రాత్రి 2025కు వీడ్కోలంటారు గెంతుతు 2026కు స్వాగతం పలుకుతారు ఒకరినొకరు పలకరించుకుంటారు బ్రతుకులు మారాలన్న భవిష్యత్ బాగుండాలన్న, ఇకనుండైనా ప్రణాళికతో పనిచేయాలి,ఫలితం పొందాలి కొత్త ఇయర్లో కష్టపడితే కలసిరావొచ్చు తలరాత మారవచ్చు కష్టాలుంటే తీరవచ్చు, సుఖప్రాప్తి పొందవచ్చు చేయాలనుకున్నవి,అనుకున్నవి జరగవచ్చు పట్టుదల,ప్రయత్నంతొ జయించవచ్చు మార్పుతొ భవిష్యత్ లొ మేలుకావచ్చు.నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ..రాష్ట్రంలోని రైతులందరూ పాడిపంటలతో సుఖసంతోషాలతో వస్తే ఐశ్వర్యాలతో 2026 సంవత్సరంలో కొత్త అడుగులు వేయాలని కోరుకుంటూ
రచన కడెం.ధనంజయ నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం చిత్తలూర్ గ్రామం

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333