వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలి

Jul 15, 2026 - 22:10
Jul 15, 2026 - 23:33
 0  2
వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలి

తిరుమలగిరి 16 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో వసతి గృహాలలో మౌలిక వసతులు కల్పించాలని  తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరీష్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు !

విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం .

పరిశుభ్రమైన తాగునీటి సౌకర్యం కల్పించాలి. మరుగుదొడ్లు, స్నానాల గదులను శుభ్రంగా నిర్వహించాలి.  24 గంటల విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలి.  సరిపడా పడకలు, పరుపులు, ఫ్యాన్లు, లైట్లు అందుబాటులో .

హాస్టల్ భవనాల మరమ్మతులు వెంటనే చేపట్టాలి.

విద్యార్థుల భద్రత కోసం అవసరమైన భద్రతా చర్యలు అమలు చేయాలి.విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉదయ్, చరన్, నగేష్, రాజేష్ పాల్గొన్నారు"

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి