వయోవృద్ధులకు ఉచిత ఛాతి X-Ray పరీక్షలు...
జోగులాంబ గద్వాల 10 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ప్రభుత్వ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ & టిబి క్షయ వ్యాధి నివారణ శాఖ వారి ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జోగులాంబ గద్వాల జిల్లా వారి సహకారంతో సీనియర్ సిటిజన్స్ మరియు వయోవృద్ధుల కోసం ఉచిత ఛాతి X-Ray శిబిరాన్ని నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సెకండ్ రైల్వే గేట్ సమీపంలోని ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ నందు నిర్వహించిన ఈ శిబిరాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జోగులాంబ గద్వాల జిల్లా చైర్మన్ సంగాల అయ్యపు రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యపు రెడ్డి మాట్లాడుతూ, వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. *ముఖ్యంగా ఛాతి సంబంధిత సమస్యలు, క్షయవ్యాధి వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలు అందించేందుకు X-Ray పరీక్షలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. వయోవృద్ధులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో దాదాపు 30 మంది సీనియర్ సిటిజన్స్ మరియు వయోవృద్ధులకు ఉచితంగా ఛాతి X-Ray పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవల కోసం సూచనలు అందించారు... ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యనిర్వాక సభ్యులు జి.గంగాధర్ గౌడ్, మహేష్ నాయుడు మరియు వైద్య సిబ్బంది ఆర్.కిరణ్ కుమార్ ఆరోగ్య సందర్శకులు, కె.వెంకటేష్ జిల్లా కార్యక్రమ సమన్వయకర్త, పి.జయరాజు సమాజ సమీకర్త, ఎం.ఉదయ్ ఎక్స్-రే సాంకేతిక నిపుణులు పాల్గొని సేవలు అందించారు...