లక్ష్మీచెన్నకేశవ స్వామి దేవస్థానంలో వైభవంగా కూడారై ఉత్సవం
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి దేవస్థానంలో వైభవంగా కూడారై ఉత్సవం- ఆత్మకూరు మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి వారి దేవాలయంలో గత నెల 16వ తారీకు నుండి ధనుర్మాస ఉత్సవాలు అత్యంతవైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చక స్వాములు శ్రీమాన్ వేంకటరంగాచార్యులు,శ్రీనివాసాచార్యులు,రమాకాంతాచార్యులు,శ్రీకాంత్ ఆచార్యులు, శనివారం 27వ విశేష పాశురమును పురస్కరించుకుని శ్రీపెరుమాళ్ తాయార్లు, శ్రీ గోదాదేవి ప్రత్యేక పుష్పమాలల అలంకరించి వేదోక్త పూజలు జరిపారు. గోదాకృష్ణ గోష్ఠి తో సామూహిక తిరుప్పావై దివ్య ప్రబంధం పారాయణము అనంతరము108 గంగాళపాత్రలలో " కూడారై" పాయసాన్ని నివేదన చేసారు. తిరునామాలు, శంఖు చక్రాల రంగవల్లులు భక్తులకు కనువిందు చేసాయి. అనంతరము తీర్థ ప్రసాద గోష్టి జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు,అశేషభక్తజనం పాల్గొన్నారు.