లక్షల డప్పులు వేల గొంతులు మహా ప్రదర్శన వాల్ పోస్టర్ ఆవిష్కరణ
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ఎం.ఆర్.పి.ఎస్ సురారం రాజు ఆధ్వర్యంలో లక్ష గొంతులు వేల డప్పుల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెలంగాణ రాష్టంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..సామాజిక ఉద్యమ నేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఫిబ్రవరి 07న ఎల్. బి స్టేడియం నుంచి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు జరిగే లక్షల డప్పులు వేల గొంతులు మండే మాదిగల గుండె చప్పుడు మహా ప్రదర్శన వాల్ పోస్టర్ ని ఆవిష్కరణ చేయడం జరిగింది. అడ్డగుడూరు మండలంలోని ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుంచి మాదిగ బిడ్డ జబ్బకు డప్పు వేసుకొని హైదరాబాద్ చేరుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ ల నాయకులు,మరియు కుల సంఘాల నాయకులు, తధితరులు పాల్గొన్నారు.