రోడ్లపైనే విచ్చలవిడిగా పార్కింగ్

దారుల్లో వాహనాలు.. తప్పని తిప్పలు
రాకపోకలకు ఇక్కట్లు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
పట్టించుకోని పోలీసు అధికారులు
తిరుమలగిరి 18 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి పురపాలక కేంద్రంలోని ప్రధాన రహదారిని విస్తరించిన అందులో సగం స్థలం వాహనాలు నిలవడానికీ సరిపోతుంది. గతంలో లాగానే రహదారి ఇరుకుగా మారి ప్రయాణికుల రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా కిరాణం, ఆటోఅడ్డ , వైన్స్, టీ పాయింట్ ల వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుంది. రోడ్డు మధ్యలో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఇష్టానురాజ్యంగా నిలపడం, ఎటు పడితే అటు రాంగ్ రూట్ లో వెళ్ళడం వల్ల సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు.ప్రధాన రహదారులతో పాటు గల్లీలోనూ వాహనాలు రోడ్లపైనే నిలుపుతున్నడంతో ట్రాఫిక్ కు ఇబ్బందులు తప్పడం లేదు. వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల పెద్ద సమస్యగా మారింది.
దారి అక్రమనకు గురైంది
పట్టణంలోని ,వైన్స్, చిరు వ్యాపారులు హోటల్ టీ పాయింట్ల ఎదురుగా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలపడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. వాహనాలు రోడ్డు పైనే నిలపడంతో దారి అక్రమనకు గురై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పోలీసులు స్పందించి ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని ప్రయాణికులు కోరుతున్నారు.. ..