- రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు సహాయసహకారాలు అందించే వారికి గుర్తింపు.

Jun 10, 2026 - 15:07
Jun 10, 2026 - 15:31
 0  4
- రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు సహాయసహకారాలు అందించే వారికి గుర్తింపు.
- రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు సహాయసహకారాలు అందించే వారికి గుర్తింపు.

- రహదారి భద్రత ప్రతిఒక్కరి బాధ్యత.
- ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలి..
- రోడ్డు ప్రమాదంలో ఏ ఒక్కరు ప్రణాలు కొల్పోకుండా అధికారులు సంకల్పంతో పని చేయాలి.
... జిల్లా కలక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..

- అజాగ్రత్త, నిర్లక్ష్యం వల్లనే రోడ్డు ప్రమాదాలు.
- ప్రయాణంలో సురక్షితంగా గమ్యం చేరడం కోసం అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత ఉద్యమం.
- రోడ్లపై పరిస్థితులను గమనిస్తూ ముందుకు సాగాలి.
- ఎక్కువ మంది హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
- రోడ్డు ప్రయాణంలో అవగాహన, చైతన్యం, మార్పు రావాలి. ... జిల్లా ఎస్పీ నరసింహ.

సూర్యపేట  10 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించి జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి త్రివేణి ఫంక్షన్ హాల్ వరకు సూర్యాపేట పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, పౌరులు లతో కలిసి అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత ర్యాలీ నిర్వహించడం జరిగినది, అనంతరం త్రివేణి ఫంక్షన్ హాల్ నందు పౌరులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ అవగాహన ర్యాలీ, అవగాహన సదస్సుకు జిల్లా కలక్టర్ తేజస్ నంద లాల్ పవార్, ఎస్పీ నరసింహ, హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. పౌరులతో కలసి ర్యాలీ నందు పాల్గొన్నారు.

కలక్టర్  మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి, జిల్లా రక్షణ గురించి మాట్లాడినట్లయితే పౌరుల రక్షణ ముఖ్యమైనది, పౌరుల భద్రత రక్షణలో పోలీసు శాఖ అనుక్షణం పని చేస్తుంది అని కలక్టర్ తెలిపినారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అనేక రకాల అవగాహన కార్యక్రమాలు, గ్రామ సభలు నిర్వహిస్తున్నాం ప్రజలను చైతన్య పరుస్తున్నాం అన్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు ఆధ్వర్యంలో ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. రోడ్డు ప్రమాదాల నివారణలో, రోడ్డు ప్రమాద మరణాలు సంభవించకుండా అధికారులు సంకల్పంతో పని చేయాలి పోలీస్, రోడ్డు ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, ఇతర శాఖలు సమన్వయంతో పని చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను కాపాడి సహాయసహకారాలు అందిస్తే రహవీర్ గా గుర్తింపు వస్తుంది అన్నారు, రహదారి భద్రత ప్రతి ఒక్కరి భద్రత అన్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ రోడ్డు భద్రత అంటే రోడ్డు పై ప్రయాణం చేసేసమాజంలో ప్రజలు, వాహనదారులు సురక్షితంగా గమ్యం చేరడం. ప్రతి సంవత్సరంకాలంలో తెలంగాణ వ్యాప్తంగా 7500 కు పైగా ప్రాణాలు కోల్పోతున్నారు అన్నారు, మన జిల్లాలో సగటున సంవత్సరానికి 250 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అధిక ప్రమాదాలు నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లనే సంభవిస్తున్నాయి, తప్పుడు మార్గంలో వాహనాలు నడపడం, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, పిల్లలు వాహనాలు నడపడం, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం, అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి వీటిని నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరు జాగ్రతగా అవగాహనలో వాహనాలు నడపాలి, రోడ్లపై ప్రయాణ సమాజంలో చైతన్యం మార్పు రావాలి అన్నారు. పోలీసు శాఖ అనుక్షణం అవగాహన కల్పిస్తూ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్నది అన్నారు. అర్వపల్లి, మోతే, చివ్వేంల, మునగాల, తుంగతుర్తి పోలీసు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాద సంఘటనలు వివరించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఎన్ని బాధలు పడుతున్నాయి అనేది వివరించారు. డిఫెన్సిఫ్ డ్రైవింగ్ చేయాలి, అన్ని అనుమతి పత్రాలు కలిగి ఉండాలి అన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ఎక్కువ మంది హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోక పోవడం వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు అని గంకాలు చెప్తున్నాయి అన్నారు. విద్యాసంస్థలు ప్రారంభం అవుతున్నాయి విద్యార్థులను బస్సులు, ఇతర వాహనాలు కండిషన్ లేకుంటే సీజ్ చేయాలని సంభందిత అధికారులను ఆదేశించారు.

ఆశా కార్యకర్తలకు హెల్మెట్ అందించారు, రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు.

పోలీసు కళాబృందం వారు పాటలతో అవగాహన కల్పించారు.

 కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్న కుమార్, ఎంవిఐ ఆదిత్య, సూర్యాపేట పట్టణ, రూరల్ సిఐ లు రాజశేఖర్, వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్టీసీ ఇన్స్పెక్టర్ సైదులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు ప్రవీణ్ కుమార్, జానయ్య, పట్టణ ఫైర్ స్టేషన్ అధికారి జానయ్య, అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి సతీష్, ఎస్ఐ లు ఏడుకొండలు, మహేందర్ నాథ్, సాయిరాం ఆర్ఎస్ఐ లు అశోక్, రాజశేఖర్, అన్వర్, షి టీమ్ సిబ్బంది, టెక్నికల్ టీం సిబ్బంది, రోడ్డు సేఫ్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333