రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపరాదు

Jun 29, 2024 - 16:41
 0  15
రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపరాదు
రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపరాదు

 రోడ్డుకు ఇరువైపులా  పార్కింగ్ లైన్ వేసిన చిత్రం .

గద్వాల పట్టణం:- రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపరాదనీ, అదేవిధంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపడం వలన ట్రాఫిక్ సమస్యలు వస్తాయని గద్వాల పట్టణ ఎస్ఐ  శ్రీనివాస్ మరియు ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు అన్నారు.ఎస్పీ ఆదేశాల మేరకు టౌన్ ఎస్సై, ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో శనివారం గద్వాల పట్టణ కేంద్రంలోని వైయస్సార్ చౌరస్తా పరిధిలో రోడ్డుపై ఇరు వైపులా ఆగి ఉన్న వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు..రోడ్డుకు ఇరువైపుల నిలిపిన వాహనాలను తీయించారు. అలాగే మున్సిపాలిటీ అధికారులచే  వైట్ లైన్ వేయించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు పక్కన వాహనాలు నిలపడం వల్ల వాహన చోదకులకు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయనీ, వాటిని తొలగించడం వలన ట్రాఫిక్ ఇబ్బంది ఉండదని, అలాగే యాక్సిడెంట్సు అయ్యే ప్రమాదం కూడా తగ్గుతుందని ఆయన ఈ సందర్భంగా వారు తెలిపారు. మార్కింగ్ వైట్ లైన్  ఎవరైనా అతిక్రమించి లైన్ దాటి ముందుకు వచ్చిన వాహనాలు భారీ జరిమానా తో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందని  వారు అన్నారు.ఈ కార్యక్రమం లో పోలీస్ సిబంది యశ్వంత్, నాగరాజు,సుధాకర్, గోపాల్,శివ కుమార్,తిమ్మప్ప, యూగేందర్,హెడ్ కానిస్టేబుల్ నారాయణ,తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333