రైల్వే సాధన సమితి రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికిన

Aug 19, 2026 - 20:04
 0  1
రైల్వే సాధన సమితి రిలే నిరాహార దీక్షలకు మద్దతు పలికిన

 సూర్యాపేట మున్సిపాలిటీ మాజీ  చైర్మన్ .. శ్రీమతి 
 పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు,  మరియు  8వ వార్డు వార్డు కౌన్సిలర్ పోతరాజు హిందూ శ్రీ అనిల్ 

సూర్యాపేట ప్రజల చిరకాల స్వప్నం కోసం పోరాడుతున్న బుల్లెట్ ట్రైన్ సాధన సమితి చేపట్టే  ఏ కార్యక్రమానికైనా బిఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం 6వ రోజు నిరాహార దీక్షలకు కూర్చున్న ఆర్యవైశ్యులకు.. మాజీ మున్సిపల్ చైర్మన్ పెరమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ గారు  మద్దతు పలికి వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే మార్గం వస్తే ఈ ప్రాంతమంతా పారిశ్రామికంగా,  సామాజికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ అలాట్మెంట్ ను మొదట సూర్యాపేటకు కేటాయించి తర్వాత మార్గాన్ని మార్చడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కలగచేసుకొని కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి సూర్యాపేట జిల్లా కేంద్రానికి 65వ నెంబర్ జాతీయ రహదారికి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ మార్గం.. ఏర్పాటు చేయడంతో పాటు సూర్యాపేటను రైల్వే కారిడర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాగిన విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఉద్యమం జరుగుతుందని ఏనాటికైనా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించి తీరుతామన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పూర్తి సహకారం ఉంటుందన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చిన తాము ముందు ఉంటామని అన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధించుకునేందుకు ప్రజలంతా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333