రైతుల కష్టాలను దోచుకుంటున్న మిల్లర్లు

May 7, 2025 - 20:55
 0  10
రైతుల కష్టాలను దోచుకుంటున్న మిల్లర్లు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మిల్లర్ల దోపిడీ తో కేంద్రాలు రైతులు నష్ట పోతున్నారు. ఐకెపి అధికారుల ముందు అవేదన వ్యక్తం చేసిన రైతులు. ఆత్మకూరు ఎస్.. ధాన్యం కొనుగోలు విషయంలో లో జనగాం రైస్ మిల్లర్లు దోపిడీ తో ఐకెపి నిర్వాహకులు, రైతులు తీవ్రo గా నష్ట పోతున్నామని ఐకెపి అధికారుల వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని పాతర్లపాడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏపీఎం మంజుల సిసి సుధాకర్ సిబ్బందిలు పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా జనగాం రైస్ మిల్లులు ఏదో ఒక తిరకాసు పెట్టి ఏదో ఒక రకంగా ధాన్యాన్ని తరుగు కింద దోచేస్తున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒక్క సెంటర్ నుండి ఇప్పటివరకు 9 లారీల ధాన్యం జనగాం రైస్ మిల్లు కు తరలించగా ప్రతి లోడులో తేమ, కాంటాలు, తాలు సాకుతో ప్రతి లోడుకు 5 నుంచి 6 క్వింటాలు ధాన్యాన్ని దోచేస్తున్నారని రైతులు ఆరోపించారు. కంప్యూటర్ కంటాల తూకాలు వేసిన ధాన్యాన్ని మోసపూరితమైన వే బ్రిడ్జిల తూకాల్లో తేడాలు చూపిస్తూ రైతులను దగా చేస్తున్నారని ఆరోపించారు. రోజులకొద్ది ధాన్యం లారీలను మిల్లు వద్ద నిలిపివేసి సెంటర్ల నిర్వాహకులను రైతులను అనేక ఇబ్బందులను గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం లారీలతో వెళ్లిన రైతులు మిల్లర్లపై ఆరోపరిచేందుకు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో క్వింటాలకు ధాన్యాన్ని వదిలి రావాల్సి వస్తుందన్నారు. మిల్లర్లపై పూర్తిస్థాయి విచారణ చేసి చర్యలు తీసుకొని కొనుగోలు మిల్లులను మార్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీఎం మంజుల మాట్లాడుతూ గురువుల కేంద్రంలోని ధాన్యాన్ని సక్రమంగా ప్రాంతాలు వేసి పంపించాలని తెలిపారు.మిల్లర్ల తీరుపై ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామని మిల్లులను మార్చే అధికారం ఉన్నతాధికారుల చేతిలో ఉన్నట్లు తెలిపారు.తూకాలలో గాని, తేమలో గాని, తాలు విషయంలో ఎలాంటి నష్టం జరిగిన రైతులకు ఇబ్బంది కలగకుండా ఆ నష్టాన్ని కొనుగోలు కేంద్ర వారే భరించాలని ఆదేశాలు ఇచ్చారు.