రేపు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా

Jan 25, 2025 - 19:53
 0  13
రేపు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా

 ప్రతి ప్రభుత్వ కార్యాలయం,పాఠశాల, కళాశాల ముందు - అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి జండా ఆవిష్కరణ చేయాలి

గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగాన్ని - ఆమోదించుకున్న గొప్ప దినోత్సవం గణతంత్ర దినోత్సవం
   కొంకల భీమన్న
ఎమ్మార్పీఎస్ జాతీయ సీనియర్ నాయకులు
జోగులాంబ గద్వాల జిల్లా

జోగులాంబ గద్వాల 25 జనవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. జిల్లాలోని రేపు ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి జెండా ఆవిష్కరణ చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ సీనియర్ నాయకులు కొంకల భీమన్న మాదిగ అన్నారు.ఈ భారతదేశం అన్ని రంగాల్లో ఏవిధంగా అభివృద్ధి చెందాలనో అందుకు రూపొందించినదే భారత రాజ్యాంగం అనే అన్నారు. గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న దినంగా భావిస్తూ ఏర్పాటు చేసుకున్న రోజే గణతంత్ర దినోత్సవ వేడుకలకు అర్థం.ఏ ప్రభుత్వ  కార్యాలయంలో కానీ ప్రభుత్వ పాఠశాల కళాశాలలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయకుండగా జెండా ఆవిష్కరణ చేసినట్లయితే బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్  ఆశయాలని ఆలోచన విధానాన్ని కించపరిచే విధంగా ఉన్నట్లు భావిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కానీ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల విశ్వాసం,విలువలు,అభిమానం ఉంటే వెంటనే బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి జండా ఆవిష్కరణ చేసి అంబేద్కర్  పట్ల ఉన్న అభిమానాన్ని,చిత్తశుద్ధిని చాటుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ సీనియర్ నాయకులు కొంకల భీమన్న పిలుపునిచ్చారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల,కళాశాల ముందు అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచకుండగా జెండావిష్కరణ చేసినట్లయితే ప్రతి ప్రభుత్వ అధికారి పైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేపిస్తామని ఆయన అన్నారు.ఇప్పటికైనా బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల ఆయన రూపొందించిన భారత రాజ్యాంగం పట్ల గౌరవం,చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి జెండా ఆవిష్కరణ చేయాలని అన్నారు.లేదంటే ఎమ్మార్పీఎస్ నుండి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మార్పీఎస్ జాతీయ సీనియర్ నాయకులు కొంకల భీమన్న అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333