రెండు గంటల్లో మిస్సింగ్ కేసును చేదించిన కానిస్టేబుల్
తిరుమలగిరి 03 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ఎస్.కె నజీర్ భాష (15) తండ్రి రహముద్దిన్ 9వ తరగతి తుంగతుర్తి మైనార్టీ వసతి గృహంలో విద్యనభ్యసిస్తున్నాడు ఈరోజు సాయంత్రం ఇంటి నుండి మొబైల్ ఫోన్ తీసుకొని పారిపోయాడు విద్యార్థి తల్లిదండ్రులు తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేస్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసు హరిబాబు రెండు గంటల్లో కేసును చేదించి వరంగల్ జిల్లా తొర్రూరు పట్టణంలో విద్యార్థిని పట్టుకున్నాడు తమ తల్లిదండ్రులకు అప్పగించాడు విషయం తెలుసుకున్న బండ్లపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ కానిస్టేబుల్ హరిబాబును అభినందించారు....