రుణమాఫీతో రైతుల కళ్ళలో ఆనందం. ఎంపీ
రైతు రుణమాఫీ దేశానికి ఆదర్శం. ఎమ్మెల్యే
నాగారం జూలై 18: రైతు రుణమాఫీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపారని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని వర్ధమానుకోట రైతు వేదికలో రుణమాఫీ నిధుల విడుదల ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ రైతు రుణమాఫీతో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలనలో ఉండి రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని రుణమాఫీ అంశాన్ని నిరుకారుస్తూ ఆలయాపన చేసింది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఆయన అన్నారు. గెలిచిన ఆరు నెలల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కిందని అన్నారు. అడిషనల్ కలెక్టర్ లత ఏడిఏ జగ్గు నాయక్ ఎమ్మార్వో బ్రహ్మయ్య ఎంపీడీవో శ్రీనివాస్ పిఎసిఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల బుచ్చిబాబు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్మ కంటి సోమయ్య బండ గొర్ల జనార్ధన్ వెంకట బిక్షం వీరయ్య వీరమల్లు వెంకన్న కరుణాకర్ నరసింహారెడ్డి బాలకృష్ణ బుక్క శ్రీను పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్ రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.