రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి 

 పది వేలు రూపాయలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి 

Nov 24, 2024 - 21:03
Nov 24, 2024 - 21:12
 0  14

పట్టా పాస్ బుక్ నుంచి పాత వెంచర్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు

రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్  సూర్యాపేట జిల్లా అధ్యక్షులు

తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత

(సూర్యాపేట టౌన్ నవంబర్ 24 ) పది వేలు రూపాయలు కట్టిన ఎల్ఆర్ఎస్ పై  ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని   సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్    ప్రభుత్వాన్ని కోరారు.   ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి విలేకరులతో మాట్లాడారు. పాత వెంచర్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్ కొరకు ఎదురుచూస్తున్న ప్రజలు ప్రభుత్వం పది వేల రూపాయలు మీ సేవ ద్వారా ఎల్ఆర్ఎస్ కొరకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కట్టించుకొన్న ప్రభుత్వం నేటికీ దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు.

పట్టా పాస్ బుక్ పై ఒక ఎకరం లోపు ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేసే విధంగా ప్రభుత్వం నూతన జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. పేదలు వారి కుటుంబ అవసరాల నిమిత్తం,కూతుళ్ళ పెళ్లిళ్ల కోసం ఒక్కొక్క రూపాయి వెనకేసుకొని చిన్నపాటి భూములను    కొనుగోలు చేశారన్నారు.అట్టి భూములపై కూడా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసేందుకు వెనకాడితే పేదలు మరింత ఆర్ధిక కూబిలోకి వెళ్లే ఆస్కారం ఉందన్నారు. ఒక ఎకరం పైబడిన భూములపై నాలా కన్వర్షన్ మీద రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పారు. భూముల కొనుగోలుపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు  అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి నేడు దీన స్థితికి దిగజారారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూమిని తమ అవసరాల కోసం గ్రామపంచాయతీ పట్టా పాస్ బుక్ నుండి లేఔట్లలో  జిపిఏ చేసుకున్న వెంచర్ ఫ్లాట్లకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఆపింది అలా ఆపడం వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.

అవి రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల చేయాలి. దానిని కూడా పునరాలోచించి యజమనూలు తమకి అవసరం ఉన్నంత వరకే అమ్ముకునే వెసలుబాటు గతంలో ఉన్నట్లే కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు అని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ప్రభుత్వం వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కొందరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. లేనిచో గతంలో మీ సేవలో ఎల్ఆర్ఎస్ కొరకు కట్టిన ఫీజుపై ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసే విధంగా జిఓ జారీ చేయాలని కోరారు. సూర్యాపేట జిల్లాలో 14వ వార్డు లొ కృష్ణ కాలనీలో గత 20 సంవత్సరాల క్రితమే 8 గంటల స్థలం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కోసం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు.

కావున నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించి నూతన భవన నిర్మాణం నిర్మించాలని ఆయన అన్నారు. ధరణి వెబ్సైట్లో పాత డిజిటల్ ను యాప్ తీసేసారు.అలా తీయడం వల్ల రైతులకు పేర్లు ఆన్లైన్లో రావట్లేదు వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. పది వేల రూపాయలు కట్టిన ఎల్ ఆర్ ఎస్ ను పరిష్కరించాలి అన్నారు. వెంచర్ల ప్లాట్లను నాలా కన్వెన్షన్ కింద రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు  పునరాలోచించి మరో నూతన జీఓని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ వెంకన్న ఆకుల మారయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి అయిత గాని మల్లయ్య గౌడ్ పట్టణ ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి పట్టేటి కిరణ్ రాపర్తి జానయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333