రామాపురం గ్రామంలో పదవ తరగతి విద్యార్థులకు పెన్నుల పంపిణీ
జోగులాంబ గద్వాల 6మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : వడ్డేపల్లి. మండలంలోని రామాపురం గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు గాయత్రి శ్రీనివాసులు, బోయ వెంకటేశ్వర్లు పెన్నులు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవల్లి ఆలయ ఈవో , అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ శ్రీ సత్యనారాయణరాజు తన స్వంత ఖర్చులతో ఇరు రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థులు కోసం ఆయన కోరిక మేరకు వారు పంపిన పెన్నులు శాంతినగర్ కు చెందిన అమరజీవి సేవా సమితి అధ్యక్షుడు గాయత్రి శ్రీనివాసులు, బోయ వెంకటేశ్వర్లు విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహులు, ఉపాధ్యాయులు దేవేందర్ రెడ్డి మరియు మహిళ ఉపాధ్యాయురాలు జయలక్ష్మి పాల్గొన్నారు.