రాజు కుటుంబానికి నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం అందజేత

*రాజు కుటుంబానికి నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం అందజేత*
సూర్యాపేట మండలం వెదురె వారి గూడెంలో లింగంపల్లి రాజు అనే వ్యక్తి పది రోజుల క్రితం అకాల మరణం చెందాడని తెలిసి నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా నేచర్ ఫౌండేషన్ ఫౌండర్ సట్టు నాగయ్య మాట్లాడుతూ.... 15 సంవత్సరాల క్రితం బతుకమ్మ పూలకని వెళ్లి చెట్టు పై నుండి కిందపడి నడుము విరిగ గా ఎన్నో హాస్పిటల్లో చూపించి, ఎంతో ఖర్చు పెట్టి ఇక లాభం లేక ఇంటికి తీసుకురాగా మంచానికే పరిమితమైన లింగంపల్లి రాజు గత పది రోజుల క్రితం మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న నేచర్ ఫౌండేషన్ సభ్యులు వారి ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు . 15 సంవత్సరాలుగా తన భర్తకి ఒక తల్లి వలె సేవలు చేసిన యశోద గారిని అభినందించి, వారి కుటుంబానికి సానుభూతి తెలిపి, మనోధైర్యాన్ని కల్పించారు. రాజు దిశదినకర్మకు నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యాన్ని వారి కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో నేచర్ ఫౌండేషన్ సభ్యులు సట్టు స్వామి, సట్టు చరణ్, సట్టు హరిప్రసాద్, లింగయ్య, మహేశ్వరి,అనసూయ, లక్ష్మి, సరిత,సత్యమ్మ,తిరుపతమ్మ,శిరీష,జానమ్మ తదితరులు పాల్గొన్నారు