రాజీవ్ స్ఫూర్తితో దేశ సమగ్రతను కాపాడేందుకు పునరంకితమవుదాం
రాజీవ్ వల్లే దేశంలో సాంకేతిక విప్లవం
ఆయన కృషితోనే ఐటీ, టెలికాం రంగాల అభివృద్ధి
దేశ యువతకు రాజీవ్ ఒక స్ఫూర్తి
దేశంలో సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదే అని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది మున్సిపల్ వైస్ చైర్మన్ యం.డి. షఫీ ఉల్లా అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని,భారత రత్న, దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలుగు వెంకన్న మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ ఆధ్వర్యంలో జమ్మిగడ్డలో రాజీవ్ విగ్రహనికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను రాజీవ్ నిజం చేశారన్నారు.రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలకే సర్వ హక్కులు, అధికారాలు కల్పించారు రాజీవ్ గాంధీ. స్థానిక సంస్థలను బలోపేతం చేశారు.దేశంలో మహిళలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి పేదల చేతిలో అధికారం పెట్టారు” అని అన్నారు. సాంకేతిక విప్లవం తీసుకు వచ్చింది రాజీవ్ గాంధీ అని ఆయన గుర్తు చేశారు. “ఐటీ రంగంలోనే కాదు, టెలికాం రంగంలోనే సమూల మార్పులు తెచ్చి మారుమూల పల్లెలకు చేర్చారు. దేశంలో యువకులకు రాజీవ్ ఒక స్పూర్తినిచ్చారు. దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం. ఆయన జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన సేవలను, ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి స్పూర్తితో మళ్లీ దేశ సమగ్రతను కాపాడేందుకు పునరంకితమవుదాం” అని తెలిపారు. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ ది అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు భవిష్యత్తులో రాజకీయంగా, సామాజికంగా ఉన్నత పదవుల్లో అవకాశాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరు రాజీవ్ గాంధీ ఆశయాలను ఆదర్శంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు....