రాజకీయాలు పక్కన పెట్టి ఒక మనిషిగా గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి
దేశాన్ని కాపాడిన చేతులకు మరణశాసనం రాస్తారా?
26 ఏళ్ల పాటు నక్సల్స్ తుపాకులకు ఎదురెళ్లి నిలబడ్డాడు. తన కుటుంబం, పిల్లల గురించి కూడా ఆలోచించకుండా, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అడవుల్లో దేశం కోసం డ్యూటీ చేశాడు. ఐపీఎస్ ఆఫీసర్‌గా తన నెత్తురు ధారపోశాడు. ఎన్నోసార్లు ఆయనపై హత్యాప్రయత్నాలు జరిగాయి, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దేశం కోసం ప్రాణాలొడ్డిన ఆ నిస్వార్థ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బహుమతిగా మరణాన్ని ఇస్తుందా?
ఈరోజు ఆయన చేసిన పాపం ఏమిటి? ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారును రాత్రికి రాత్రే గుంజుకుంది? ఎందుకు ఆయన చుట్టూ ఉన్న ఏకే-47 గన్‌మెన్లను లాగేసుకుంది? ఆయన ఏమైనా దోపిడీలు చేశాడా? అవినీతికి పాల్పడ్డాడా?
కాదు.. ఆయన చేసిన ఒకే ఒక్క తప్పు.. అన్యాయాన్ని ప్రశ్నించడం!
ఒక పసిపిల్ల కన్నీరు తుడవటం తప్పా?
బండి సంజయ్ కొడుకు చేతిలో పాశవికంగా వేధింపులకు గురైన ఒక పసిపిల్ల (పోక్సో బాధితురాలు) కోసం ఆయన కన్నీరు పెట్టుకున్నాడు. ఆమెకు న్యాయం జరగాలని గొంతెత్తాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ప్రాణ స్నేహితులు అన్న ఒక్క కారణంతో... తన దోస్త్ కొడుకుని కాపాడటం కోసం, ఒక ఆడబిడ్డ పక్షాన నిలబడిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రాణాలను బలిపీఠం ఎక్కిస్తారా? ఇది ఏ దేశపు న్యాయం?
పేదల తరపున నిలబడటం నేరమా?
'జీవో 17' పేరుతో 300 కోట్ల టర్నోవర్ ఉంటేనే ప్రభుత్వ టెండర్లు వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చీకటి చట్టాన్ని ఆయన ప్రశ్నించాడు. "రెక్కాడితే గానీ డొక్కాడని ఒక మాదిగ బిడ్డ, ఒక చిన్న దళిత వ్యాపారి 300 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడన్నా?" అని నిలదీశాడు. బడుగుల కడుపు కొట్టొద్దు అని వేడుకున్నాడు. దానికి శిక్షగా... ఏకంగా ఆయన ప్రాణాలకే రక్షణ లేకుండా చేస్తారా?
ఒక్కసారి వీడియో ఫైల్ చూడండి. అందులో ఆర్ఎస్పీ గారి మాటలు వింటే ఆయనను తీవ్రంగా ద్వేషించే వారి కంట కూడా కన్నీరు వస్తుంది.
"నాపై గతంలోనే హత్యాయత్నాలు జరిగాయి.. అయినా నేను జనంలోనే తిరుగుతా, దేశం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం" అని చెబుతున్న ఆ గొంతులో చావు భయం లేదు. కానీ తాను ప్రాణమిచ్చి కాపాడిన ఈ వ్యవస్థే, ఇప్పుడు తనను కుట్రపూరితంగా వెన్నుపోటు పొడుస్తోందన్న ఆవేదన కనిపిస్తోంది.
మీరు ఆయనను రాజకీయంగా వ్యతిరేకించవచ్చు, ఆయన సిద్ధాంతాలు మీకు నచ్చకపోవచ్చు. కానీ, ఒక ఆడబిడ్డ మానం కోసం, పేదల బతుకుల కోసం పోరాడుతున్న ఒక నిజాయితీపరుడి వద్ద నుంచి రక్షణ కవచాలు లాగేసుకుని వ్యవస్థను అడ్డుపెట్టుకుని భయపెట్టాలని చూడటం ఎంతవరకు సమంజసం?
దేశం కోసం 26 ఏళ్లు సేవ చేసిన ఆ దళిత బిడ్డకు ముప్పు ఉందని తెలిసి కూడా రక్షణ తొలగించడం దారుణం కాదా?ఈరోజు ఆర్ఎస్పీ గారికి జరిగిన ఈ అన్యాయం ఆయనకు ఒక్కరకే కాదు మనందరికీ జరిగిన అన్యాయం•
రేపు మీ ఇంట్లో ఆడబిడ్డకు ఏదయినా అన్యాయం జరిగితే, మీ తరపున పోరాడటానికి ఎవరైనా ముందుకు వస్తాడా? దయచేసి ఆలోచించండి. ఇది పార్టీల సమస్య కాదు, ఒక మనిషి ప్రాణాల సమస్య. రాజకీయ కక్షల కోసం ఒక మంచి నాయకుడి ప్రాణాలతో ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ కుట్రను ప్రతి ఒక్కరం ఖండిద్దాం! ఆడబిడ్డల కోసం, అణగారిన వర్గాల కోసం నిలబడిన ఆ గొంతుకు మనం అండగా నిలబడదాం!