రాక పోకలు నిలిచిపోయి అనేక ఇబ్బందులు పడుతున్న బాధితులకు

Aug 31, 2024 - 13:00
Aug 31, 2024 - 13:22
 0  8

విజయవాడ ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 51 వ డివిజన్ శ్రీ తెలప్రోలు  రాజా హై స్కూల్ పక్కన పితాని అప్పలస్వామి స్ట్రీట్ లేబర్  కాంగ్రెస్ ఆఫీస్ వెనుక భాగం లో కొండపైన కొత్త పేట 9-31-6,9-31-6/1 రాత్రి కురిసిన భారీ వర్షం కారణం గా రెండు ఇల్లు పురాతనమైన సపోర్ట్ గోడ మెట్లు కూలిపోవడం జరిగింది. అప్పటికి అప్పుడు ఆ ఇళ్లలో ఉన్నటువంటి నివానీతులు అప్రమత్తం అవ్వడం తో ఎటువంటి ప్రమాదం జరగలేదు  ఎరుసు రమణ అనే వాళ్ళ ఇల్లు పూర్తిగా ధ్వంశం అయినది.

 రెండొవ ఇల్లు బాత్రూమ్ సందు సపోర్ట్ గోడ కూలి పోవడంతో వెనుక పై భాగం నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ పొట్నూరి దుర్గా రావు వారి ఇంట్లో కి వస్తుండటం తో రాత్రి నుండి చిన్న పిల్లలు మహిళలతో ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని బిక్కు బిక్కు మంటు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో దారి పూర్తిగా మూసుకుపోయింది. స్థానికులు పనికి పోవడానికి వీలు లేకుండా రాక పోకలు నిలిచిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు బాధితులకు ప్రభుత్వం, అధికారులు సహాయ సహకారం అధించాలని కోరుతున్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333