రమణమ్మ కుటుంబాన్ని పరామర్శించిన బీరం హర్షవర్ధన్ రెడ్డి
28-05-2026 తెలంగాణ వార్తా రిపోర్టర్ చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన గూడెం గ్రామంలో చెన్న మౌని రమణమ్మ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి. వివరాలలోకి వెళితే చేన్న మౌని రమణమ్మ కు ఎండ తీవ్రతకు హార్ట్ స్ట్రోక్ రావడంతో అంబులెన్సులొ హాస్పిటల్ కి తీసుకపోయే క్రమంలో మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. తుది శ్వాస విడిచింది అని తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరు పర్వంతమయ్యారు. గూడెం గ్రామ బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తోట బాలకృష్ణ ద్వారా విషయం తెలుసుకున్న మాజీ కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మరియు చిన్నంబావి మండల మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ విషయం తెలుసుకుని ఈరోజు గ్రామానికి వచ్చి రమణమ్మ కుటుంబాని పరామర్శించారు. అదే గ్రామంలో మద్దూరి కురుమయ్య పెరాలసిస్ రావడంతో అతనిని కూడా కలిసి అతని ఆరోగ్యం గురించి తెలుసుకుని అతనికి కావలసిన సలహాలు సూచనలు ఇచ్చి పరామర్శించి వెళ్లారు. వీరితోపాటు గజ్జి ఈదన్న, కృష్ణ యాదవ్, పింజరి కాసిం, మేకల బాలస్వామి, రామకృష్ణ, అంజి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు