రగులుతున్న వరి కొయ్యల మంటలు
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఆత్మకూరు ఎస్ మండలంలో నాలుగు గ్రామాల్లోని వరి కొయ్యల మంటలు నిమ్మతోట, చీమ కోళ్లు, విద్యుత్ మోటార్లు పైపులు స్టార్టర్లు, కాలి బూడిద అయ్యాయి. నిప్పుపెట్టున రైతే ఊపిరాడక ఆసుపత్రి పాలయ్యాడు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం కాకపోతే ఏపూర్ లోని పెట్రోల్ బంకు అగ్ని ప్రమాదం సంబంధించి గ్రామములో తీవ్ర నష్టం జరిగే ప్రమాదం తప్పింది. కందగట్లలో ఓ రైతు వరి కోయాలకు నిప్పు పెట్టగా పక్కనే ఉన్న తోటరాములు కు చెందిన నిమ్మ తోట లో వందలాది చెట్లు మాడి మైసయ్యాయి. తోటలో పెంచుకున్న చీమ కోళ్లు కాలి బూడిదయ్యాయి. ఏపూర్ కు చెందిన వర్డ ఉప్పలయ్య అనే రైతు రామన్న గూడెం శివారు తన పోలం లో వరి కొయ్యల కు నిప్పు పెట్టగా సుమారు కిలోమీటర్ వరకు మంటలు వ్యాపిస్తూ ఏపూరి పెట్రోల్ బంక్ సమీపం వరకు వచ్చాయి. ఆ మంటలు ఆర్పే క్రమంలో రైతు ఉప్పలయ్య పొగ కు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మంటలు రెండు ట్రాన్స్ఫార్మర్లు కొందరు రైతుల మోటర్లు స్టార్టర్లు పైపులు తాలిబూడిదయ్యాయి. ఎస్సై ఐలయ్య, ఏపూరి సర్పంచ్ చంద్రమోహన్, ఫైర్ ఇంజన్ సిబ్బంది, స్థానిక రైతులు హుటాహుటిన మండల ఆరిపారు. ఏమాత్రం ఆలస్యమైనా పెట్రోల్ బంక్ తో పాటు సమీపంలో ఉన్న గ్రామస్తుల ఇల్లు అగ్ని ప్రమాదంలో చిక్కిపోయాయి