రజకులపై ఇలాంటి దాడులకు పాల్పడుతున్న వారిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి
రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పు భిక్షపతి డిమాండ్
హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దాడి చేసి రెండు నెలల బాలిక ను బలి తీసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పు బిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.
ఆదివారం నాడు ఆయన రజక సంక్షేమ సంఘం ముఖ్య నాయకులతో మాట్లాడుతూ ఇలాంటి ఘటన ఘటనలకు పాల్పడిన నిందితులపై హత్య కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని చేయాలని
రజక కుటుంబం పై దాడి చేసి రెండు నెలల చిన్నారిని బలిగొన్న ఉపేందర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఉంధ్యాల శ్రీనివాసరెడ్డి తుకారాం రెడ్డి సతీష్ రెడ్డి లను కఠినంగా శిక్షించాలని, రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబం శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని వెళ్ళగా దర్శనం చేసుకోకుండా నిర్వాహకులు చంద్రకళ కుటుంబాన్ని అడ్డుకోగా ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగినచంద్రకళ కుటుంబాన్ని బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ అతి కిరాతకంగా క్రూరగా కొట్టి చిన్నారిని కాలుతో తన్నిన దుర్మార్గులను సాంఘిక బహిష్కరణ చేయాలని వారు కోరారు
నిందితులపై కేసు నమోదు చేయకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తున్న అక్కడి పోలీసు అధికారులను శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలని, ముఖ్యంగా అక్కడి సీఐ ను స్థానిక విలేకరులు ఫోన్లో సంప్రదించగా బాధితుల పక్షాన మాట్లాడుకుండా, తలకు దెబ్బ తగిలిందని నిందితుల పక్షాన మాట్లాడిన సీఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.