రంజాన్‌ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి..

Mar 20, 2026 - 21:01
 0  1
రంజాన్‌ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి..

ప్రేమ,శాంతి,దానగుణానికి నిదర్శనం రంజాన్‌..

 ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి..

రంజాన్‌ పండుగను భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.మత సామరస్యానికి ప్రతీక రంజాన్ నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు చేస్తారని పేర్కొన్నారు. ఈనెల 21న జరిగే రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. రంజాన్‌ పండుగను సూర్యాపేట నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా జరుపుకోవడం ఇక్కడి ప్రజల ఐకమత్యానికి ప్రతీక అన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉందని, పవిత్ర రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని, ముస్లింలందరూ రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు.పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు అత్యంత నిష్టతో అల్లాను ప్రార్థిస్తారని తెలిపారు. ఆత్మీయతకు మారుపేరైన రంజాన్‌ ప్రజలందరికీ సుఖసంతో షాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు.సూర్యాపేట నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333