యూరియా సరఫరా కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

Sep 9, 2025 - 19:27
 0  3
యూరియా సరఫరా కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు

జిల్లాలో రైతులకు సరఫరా అవుతున్న యూరియ కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు తెలిపారు.

మంగళవారం గద్వాల టౌన్ లో ఉన్న  వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన యూరియా సరఫరా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ  సందర్శించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ రైతులకు యూరియ కోసం ఇస్తున్న టోకెన్స్ విధానాన్ని పరిశీలించారు. రైతులకు సరఫరా చేస్తున్న యూరియా సంబందించిన వివరాలను వ్యవసాయ శాఖ అదికారులు ఎస్పీ కి వివరించారు. గోదాంలలో నిల్వ ఉంచిన ఎరువులను కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పంపిణీ చేయాలని అన్నారు. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని, రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని యూరియాను సకాలంలో అందించాలన్నారు. రైతులకు ఎరువులు సమయానికి అందేలా చూడాలని అక్కడి అధికారులకు ఆదేశించడం జరిగింది.  

 జిల్లా ఎస్పీ అక్కడ ఉన్న రైతులతో మాట్లాడుతూ...  వారు ఎలాంటి  పంటల వేశారు, వారికి ఇప్పటిదాకా ఎంత యూరియా అందింది ఇంకా ఎంత అవసరం అవుతుంది అనే విషయాలను రైతులను అడిగి తెలుసుకన్నారు.  తదుపరి జిల్లాలో రైతులకు ఇబ్బంది కలగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 


ఈ కార్యక్రమంలో  డీఎస్పీ వై .మొగిలయ్య , గద్వాల్ సిఐ శ్రీను, గద్వాల్  టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్,  సిబ్బంది పాల్గొన్నారు .

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333