యువత ఉద్యోగాలు సాధించి వారి తల్లిదండ్రులకు హార్దిక భరోసా కల్పించాలి

యువత ఉద్యోగాలు సాధించి వారి తల్లిదండ్రులకు ఆర్ధిక భరోసా కల్పించాలి
తెలంగాణ వార్త ములుగు స్టాఫ్ రిపోర్టర్ జూన్ /19/2024
యువత ఉద్యోగాలు సాధించి వారి తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.బుధవారం ములుగు జిల్లా ఇంచేర్ల గ్రామం లోని యం,ఆర్ ఫంక్షన్ హాల్ లో 52 ప్రైవేట్ కంపెనీలు, 2000 ఖాళీల ఉద్యోగాలతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ను రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్పీ శబరీష్ లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో ఉండే స్థానిక యువత ఉద్యోగాలు సాధించి వారి తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించాలని దీనికి అనుగుణంగా 2000 వేల ఖాళీల ఉద్యోగాలతో,52 ప్రైవేట్ కంపెనీలతో మెగా జాబ్ మేళా ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.అనేక మంది యువత జాబ్ మేళాలకు హాజరై ఉద్యోగాలు సాధించిన అనంతరం పది రోజులు విధులు నిర్వర్తించి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కారణంతో వచ్చిన అవకాశాన్ని వదిలేస్తున్నారని కష్టాలను ఎదుర్కొని నిలబడుతేనే విజయం వరిస్తుందని అన్నారు.ఈ జాబ్ మేళ ద్వారా 7 వ తరగతి నుండి ఉన్నత చదువులు చదివిన యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకొని, గ్రామీణ స్థానిక యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.గ్రామీణ ప్రాంతాలలోని యువతకు ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించడం కోసం ములుగు జిల్లాలో త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని , యువత కష్టపడితేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని , ఉద్యోగం సాధించడం ద్వారా కుటుంబంలో ఆర్థిక అభివృద్ధి వికసిస్తుందని అన్నారు.ప్రభుత్వ, ప్రైవేట్ ఏ ఇతర రంగాలలో ఉండే ఉద్యోగాలలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వాటిని అడిగామిస్తూ ముందుకు వెళితేనే జీవితంలో విజయం సాధిస్తామని యువతకు తెలిపారు.ఈ సందర్భంగా జాబ్ మేళ లో 52 కంపిణీలలో ఉద్యోగాలు సాధించిన 700 మంది యువతీ, యువకులకు నియామక పత్రాలు మంత్రి అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ పి శ్రీజ ,డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్,డీఎస్పీ రవీందర్ , వివిధ ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు, యువతి యువకులు పాల్గొన్నారు.