యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు

Aug 24, 2026 - 20:21
 0  3
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు

రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు.

కోలనుపాకలో ల్యాండ్ కన్వర్షన్ వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు.

రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్‌తో పాటు గ్రామ పంచాయతీ రెవెన్యూ అధికారి లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

డిమాండ్ చేసిన లంచంలో భాగంగా రూ.14 వేల నగదు తీసుకుంటుండగా, ఆలేరు ఎంఆర్వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

ఇద్దరు రెవెన్యూ అధికారులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333