మేడే పోరాట స్ఫూర్తితో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ను సాధించాలి
నెమ్మాది వెంకటేశ్వర్లు
ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి..
ఆత్మకూరు ఎస్
దేశ వ్యాప్తంగా ఎగుమతి దిగుమతి చేస్తున్న హమాలీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలని ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు...
శనివారం నాడు మేడే వారోత్సవాలలో బాగంగా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో ఐకెపి హమాలీ కార్మికులు మేడే కార్యక్రమం నిర్వహించారు... ఈ సందర్భంగా CITU జెండాను యూనియన్ అధ్యక్షుడు ములకలపల్లి శ్రీనివాస్ ఎగుర వేసారు...
ఈ కార్యక్రమంలో పాల్గొని నెమ్మాది మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఎగుమతి దిగుమతి చేస్తూ ఇటు ప్రభుత్వానికి , ప్రయివేటు వ్యాపారస్తులకు కోట్లాది రూపాయలు ఆదాయం తెస్తున్న హమాలీలకు మిగిలేది ఏమీలేదని ఆయన అన్నారు... హమాలీ పని చేస్తున్న కార్మికులు పూర్తిగా వెనుకబడిన తరగతులకు చెందిన ఎస్,సి, ఎస్ టి, బీసీ, మైనార్టీలకు చెందిన పేద వారనీ వారిలో కూడ ఉపాధి లేక ఉన్నత చదువులు చదువుకున్న నిరుద్యోగులు కూడ ఉన్నారని, యేడాది మొత్తం పని దొరకక, ఇతర పనులు చేయలేక దర్భల జీవితాలు హమాలీలు కొనసాగిస్తున్నారని ఆయన వాపోయారు...
హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏండ్ల తరబడి పోరాటాలు చేస్తున్న పాలకులు పెడచెవిన పెడుతున్నారని నెమ్మాది అవేదన వ్యక్తం చేశారు...
చిన్న వయసులో ఎగుమతి, దిగుమతి పేరుతో బరువులు మోయడం వల్ల గుండె జబ్బులు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు ఉపిరి తిత్తుల వ్యాధులకు గురవుతున్నారని ఆయన అన్నారు...
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని, భవన నిర్మాణ కార్మికుల వలే హమాలీలకు కూడ సంకేమ బోర్డును ఏర్పాటు చేయాలని నెమ్మాది డిమాండ్ చేశారు...
రానున్న రోజుల్లో సంక్షేమ బోర్డు ఏర్పాటు కొరకు మేడే పోరాట స్ఫూర్తితో సమరశీల పోరాటాలు ఆల్ హమాలీ వర్కర్స్ ఐక్యంగా ఉద్యమించాలని నెమ్మాది పిలుపు ఇచ్చారూ..
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ యాతకుల వెంకన్న, యూనియన్ అధ్యక్షుడు ములకలపల్లి శ్రీనివాస్, మల్లయ్య, వెంకన్న, సైదులు, రాములు, తదితరులు పాల్గొన్నారు...