ప్రైవేట్ స్కూల్ బస్సులను అకస్మితానికి రవాణా శాఖ అధికారులు.
జోగులాంబ గద్వాల 17 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- అయిజ. పట్టణంలో బుధవారం గద్వాల రవాణాశాఖ అధికారులు స్కూల్ బస్సులు తనిఖీ చేశారు. కాకతీయ, వైష్ణవి పాఠశాలల బస్సులను తనిఖీ చేసి, ఫిట్నెస్ లేకపోవడంతో సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు గద్వాల ఎంవీఐ రామ్ చరణ్ తెలిపారు. జిల్లా రవాణా శాఖ అధికారి రాధిక ఆదేశంతో పాఠశాలల బస్సులు తనిఖీ చేశామన్నారు. తనిఖీలలో కార్యాలయ సిబ్బంది గోవర్ధన్, రిషి, గోవిందు పాల్గొన్నారు.