వంద పడకల ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందించాలి
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.
ఆస్పత్రి అభివృద్ధి పై సమీక్ష సమావేశం లో పాల్గొన్న అదనపు కలెక్టర్
జోగులాంబ గద్వాల 17 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :- అలంపూర్ చౌరస్తా లోని వంద పడకల ఆసుపత్రిలో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా డాక్టర్లు కృషి చేయాలని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. బుధవారము అలంపూర్ చౌరస్తా లోని వంద పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే విజయుడు, జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, డి సి హెచ్ ఎస్ రమేష్ చంద్ర తో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి అభివృద్ధిపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై చైర్మన్ హోదాలో ఆసుపత్రి అభివృద్ధిపై ఆరా తీశారు.ఆస్పత్రి దినదినాభివృద్ధి చెందుతున్నది. ప్రజలకు అవసరమైన అన్ని వైద్య సేవలను అందుబాటులో ఉండాలని డాక్టర్లకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఆస్పత్రిలో ప్రధానంగా మిషన్ భగీరథ తాగునీరు విద్యుత్ సమస్య,ఇన్వర్టర్లు కొనుగోలు, కంప్యూటర్స్ కొనుగోలు, ఈ ఎన్ టి మిషన్, ఎండోస్కోపీ మిషనరీ, మైక్రోస్కోప్ బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ కేంద్రం, ఆసుపత్రికి కాంపౌండ్ వాల్ నిర్మాణం, ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ, మార్చారుకి సంబంధించిన వస్తువులను సమకూర్చాలని డి సి హెచ్ ఎస్ రమేష్ చంద్ర ఎమ్మెల్యే ని అదనపు కలెక్టర్ ని కోరారు. అలాగే ఆరోగ్యశ్రీ 38 లక్షల రూపాయలు వివిధ అభివృద్ధి పనులకు మంజూరైనట్లు డి సి హెచ్ ఎస్ పేర్కొన్నరు.సీసీ కెమెరాలు ఆసుపత్రి సైన్సు బోర్డు సెక్యూరిటీ గార్డు గదులు బయో వేస్టేజ్ గది వంటి వాటిని ఆసుపత్రిలో వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు మాట్లాడుతూ.. వంద పడకల ఆసుపత్రి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఐదు ఎకరాలలో నిర్మించడం జరిగిందన్నారు.ఆస్పత్రి అభివృద్ధిపై ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో తీర్మానించిన అంశాలు అభివృద్ధి పనులు వచ్చే మూడు నెలల్లో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఈ కమిటీ పని చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్ మై అలంపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పిండి జయరాములు, పుల్లూరు గ్రామ సర్పంచ్ సునీత వివిధ శాఖల వైద్యాధికారులు పాల్గొన్నారు