మెగా పశు వైద్య శిబిరం
అడ్డగూడూరు 8 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా 08-05-2026 శుక్రవారం రోజు పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ తెలంగాణ పశు గణాభివుధి సంస్థ ఆధ్వర్యంలో అడ్డగూడూరు మండల పదవిలోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో మెగా పశు వైద్య శిబిరం పశు గర్భకోశవ్యాది చికిత్స శిబిరము మరియు మేలుజాతి దూడల ప్రదర్శన శిబిరము వేసవికాలంలో పశు సంరక్షణ ఫై అవగహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవికాల్వ గ్రామ రైతులు, ఉప సర్పంచ్, వార్డ్ మెంబెర్స్, మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గోపాలమిత్ర సిబ్బంది కొమురయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.