మూసి నీటిని విడుదల చేయాలి  వినతి పత్రం అందజేసిన  రైతులు 

Aug 17, 2026 - 18:50
 0  1
మూసి నీటిని విడుదల చేయాలి   వినతి పత్రం అందజేసిన  రైతులు 

సూర్యాపేట: వరి పొలాలకు మూసి నీటిని విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట మండల పరిధిలోని తాళ్ల ఖమ్మంపహాడు, పెన్ పహాడ్ మండలం సింగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రైతులు  ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ శాఖ  డీఇలకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామాలకు చెందిన పొలాలు 36, 37,38 మూసి కెనాల్ ఎడమ కాలువ ఆయకట్టు కింద సుమారు 300 ఎకరాల వరి పొలాలు నాటు వేశామని నీరు లేక వరిపొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనాధారమైన వృత్తి వ్యవసాయం కాబట్టి తక్షణమే తమ పొలాలకు నీటిని విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తాళ్ల ఖమ్మంపహాడు, సింగిరెడ్డిపాలెం, రైతులు ఎలక సైదులు, బెల్లంకొండ సీతారాములు, బోర సైదులు, పేర్ల మల్లయ్య,పాముల మల్లయ్య, గంట పంగి వెంకన్న, నామ రవి, గుండాల యలమంచయ్య, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333