మురుగు నీరు పారేదెలా...? దుర్వాసనతో ప్రజలు పరేషాన్
ఏళ్లు గడుస్తున్న డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయని అధికారులు.
పట్టణ ప్రగతిలో సాధించిదేముంది,??
డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి: స్థానికులు.
డ్రైనేజీ కాలువ లేక ఇండ్ల మద్యనే మురుగు
జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. మున్సిపాలిటి పరిధిలోని 16 వార్డు లో గల రెవెన్యూకాలనీలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. కాలనీలో పలు ఇండ్లకు డ్రైనేజీ మార్గం లేకపోవడంతో మురుగు నీరు ఇండ్ల ముందు వచ్చి చేరి కుంటగా మారింది. మురుగు నీరు ఇండ్ల ముందు నిల్వ ఉండటంతో ప్రజలు రోగాల బారినపడే అవకాశం ఉందని, మురుగు నీటితో దుర్గంధం వెదజల్లుతుందని కాలనీ వాసులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతిలో భాగంగా రెవెన్యూకాలనీలో కొన్ని ఇండ్ల నుంచి వస్తున్న మురుగు నీరు పారేలా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపించారు. వర్షాకాలంలో విషజ్వరాలు ప్రబలించే అవకాశం ఉందని రెవెన్యూ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు కోరుతున్నారు.