ముమ్మరంగా కొనసాగుతున్న వీధి కుక్కల తరలింపు

Jun 23, 2026 - 14:59
 0  2
ముమ్మరంగా కొనసాగుతున్న వీధి కుక్కల తరలింపు
ముమ్మరంగా కొనసాగుతున్న వీధి కుక్కల తరలింపు

గద్వాల (జూన్ 23): బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో సంచరించే కుక్కలను అక్కడి నుంచి తరలించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం గద్వాల మున్సిపాలిటి పరిధిలోని చింతలపేట మద్రాస్ పేట పెద్ద అగ్రహారం కెoచ వీధి  బెల్లగంటి వీధి  వీధిలో  32.33. వార్డుల లో మున్సిపల్, పశుసంవర్ధక శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాలనీలో సంచరిస్తున్న వీధి కుక్కలను ప్రత్యేక సిబ్బంది సహాయంతో సురక్షితంగా నిర్బంధించి, స్థానిక పశువుల ఆసుపత్రికి తరలించారు. ​అక్కడ వైద్యుల పర్యవేక్షణలో వాటికి సంతాన నియంత్రణ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. శస్త్రచికిత్సల అనంతరం వీటికి యాంటీ-రేబిస్ టీకాలు కూడా వేయనున్నారు. వార్డులలో కుక్కల సంఖ్యను అదుపు చేయడంతో పాటు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకే ఈ డ్రైవ్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్లు పూర్తయిన తర్వాత, కోలుకున్న కుక్కలను తిరిగి యథాస్థానంలోనే వదిలిపెడతామని స్పష్టం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333