మున్సిపాలిటీలో లోపించిన పారిశుద్ధ్యం

మాలిపురం పోయే దారిలో ఆర్టిఏ ఏజెంట్ జంపాల వెంకన్న ఆవరణంలో,
ఆదర్శనగర్, పద్మశాలి కాలనీల్లో రోడ్లపై పారుతున్న మురుగు నీరు
తిరుమలగిరి 09 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు , ఆదర్శనగర్ , పద్మశాలి కాలనీల్లో పారిశుధ్యం లోపించింది. కాలనీలలో చాలా చోట్ల మురుగు నీరు రోడ్లపై పారుతూ దుర్గంధం వెదజల్లుతుంది. రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య పనులు, మురుగు కాల్వల నిర్మాణం, మరమ్మతుల గురించి మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీల వాసులు వాపోతున్నారు