మా భూమిని మాకు ఇప్పించి కొత్త పట్టాదారు పాసుబుక్ లు ఇవ్వాలి
వెలుగుమట్ల భూధన్ భూముల రైతులు
ఖమ్మం. 31 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల వెలుమట్ల గ్రామపంచాయితీ నిరుపేద బడుగు , బలహీన వర్గాల రైతులు మాట్లాడుతూ మేము గత 30 సంవత్సరాలుగా మొత్తం 27 మంది రైతులము సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు . భూమి మొత్తం సర్వే నెంబరు 147, 148 మరియు 149లో 31 ఎకరాల 7 కుంటల భూమి మేము సాగు చేసుకుంటున్నాము . ఈ భూమి మా తాతల నుండి వంశపారపర్యంగా మాకు సంక్రమించింది . ఈ భూమి పై సర్వ హక్కులు మాకే ఉన్నవి . గత 3 సం||ల క్రితం నుండి కొంత మంది వ్యక్తులు మా వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించారు . ఈ భూమి మాది అని మేము అందరము అక్కడికి వెళ్ళగా మా మీదకు ఆడవాళ్ళను ఉసిగొల్పి దౌర్జన్యంగా మమ్ములను తిడుతున్నారు . ఈ విషయపై గతంలో మేము అందరము ఖమ్మం జిల్లా కలెక్టర్ కి విన్నవించుకోగా కలెక్టర్ మా భూమిని పరిశీలించి ఆ వ్యవసాయభూమి ఈ 27 మంది రైతులకే చెందుతుంది అని చెప్పి అక్కడ వాళ్ళకు మేము న్యాయం చేస్తాము మీరు ఖాళీ చేయండి అని చెప్పినారు . ఇంత వరకు మా భూమిని ఆక్రమించిన వాళ్ళు ఇంకా అక్కడే గుడిసెలు వేసుకొని ఉంటున్నారు . ఈ విషయమై హైకోర్టు W.P.No. 29021 / 2019, 31.12.2019 మా 27 మంది రైతులకు అనుకూలముగా ఆర్డరు ఇచ్చినది . కావున మా యందు దయ ఉంచి జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకొని మా మా భూమిని మాకు ఇప్పించి అక్కడ వేసిన గుడిసెలు తొలగించి మాకు న్యాయం చేయాలని పత్రికముకంగా వేడుకున్నారు . ఇట్టి భూమికి మాకు క్రొత్త పట్టాదార్ పాసుపుస్తకము ఇవ్వగలరని ప్రభుత్వాన్ని మరియు సంబంధించిన అధికారులను కోరారు . ఈ కార్యక్రమంలో బందెల వెంకన్న , బందెల కృష్ణ , షేక్ సొందు , షేక్ గోరే మియా , దోమల రాము , లకావత్తు నాగేశ్వరరావు , షేక్ సైదాబీ , షేక్ ఆశ , షేక్ జానీ మియా , మద్దె నాగమణి , బుచ్చి రాములు , దుర్గారావు , రామస్వామి , మోతిరయ్య , వెంకటరత్నం , వీరస్వామి , రమ , రాజారావు , బి వెంకన్న తదితరులు పాల్గొన్నారు .