మాల మహానాడు నూతన జిల్లా అధ్యక్షునిగా బొప్పని నగేష్

మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి
తెలంగాణ వార్త మాడుగుల పల్లి మార్చి 19 : మాడుగులపల్లి మండలం తోపుచర్ల గ్రామానికి చెందిన బొప్పని నగేష్ జిల్లా మాల మహానాడు అధ్యక్షుడిగా నియమితులైనారు గ్రామ మాల మహానాడు అధ్యక్షునిగామండల అధ్యక్షునిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వంటి బొప్పని నగేష్ ని తన యొక్క నిబద్ధతని గుర్తించి మాల మహానాడు జాతీయ నాయకులు జిల్లా అధ్యక్షునిగా నియమించినారుమాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు చిక్కుడు గుండాలు, ముండ్లగిరి కాంతాయ చేతుల మీదుగా నియమాపక పత్రం అందజేశారు. జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ నగేష్ తన నిబద్ధతని చాటుకొని ఇంకా ఉత్తమమైన పదవులు పొందాలని మాలల కులాల తరపున తన పోరాటాలు కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, మాల మానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ముల్లగిరి కాంతాయ, మాల మహానాడు జాతీయ విద్యార్థి విభాగం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి సురేష్, సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షురాలు పెరుమళ్ళ ధనమ్మ, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఏనుముల రాజ్ కుమార్, జాతీయ రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.