మారకద్రవ్యాలు సైబర్ క్రైమ్ ల పై అవగాహన నిర్వహించిన ఎస్సై పెరక రవీందర్

Aug 7, 2024 - 21:24
Aug 8, 2024 - 08:05
 0  75
మారకద్రవ్యాలు సైబర్ క్రైమ్ ల పై అవగాహన నిర్వహించిన ఎస్సై పెరక రవీందర్

గంజాయి గుట్కా సైబర్ నేరాలపైఅవగాహన అన్నారం బ్రిడ్జి గ్రామంలో అవగాహన కల్పిస్తున్న ఎస్సై రవీందర్

తెలంగాణ వార్త పెన్ పహాడ్ మండలం ఆగస్టు 7: గ్రామంలో ప్రజలందరూ గంజాయి గుట్కా సైబర్ నేరాలను నిర్మూలించడంలో భాగస్వాములు కావాలని ఎస్సై పెరిక రవీందర్ అన్నారు బుధవారం మండల పరిధిలోని నాగులపాటి అన్నారం బ్రిడ్జి గ్రామంలో గ్రామస్తులకు, యువతకు, అవగాహన కల్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి ,గుట్కాలు విక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన అన్నారు గంజాయి అమ్మడం గాని కొనుగోలు చేయడం గాని రవాణా చేయడం గాని చేస్తే చట్టప్రకారం చర్యలు హెచ్చరించారు. సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రామాంజనేయులు, రవీందర్ రెడ్డి శ్రీనివాస్, గ్రామ ప్రజలు రంగయ్య ,ఉపేందర్ ,అనిల్ రెడ్డి, రవి యాదవ్ ,నవీన్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State