మానవుని మనగడకు జీవనాధారం చెట్లు

Jul 12, 2024 - 21:23
 0  10
మానవుని మనగడకు జీవనాధారం చెట్లు

ప్రతి ఒక్కరూ విధిగా చెట్లు నాటాలి

 - మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ , కౌన్సిలర్ వెలుగు వెంకన్న

సూర్యాపేట .చెట్లు లేకుంటె మానవ మనుగడ లేదని,చెట్లు లేకపోవడం వలన వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న అన్నారు. శుక్రవారం నాడు నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా  పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ చౌరస్తా నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్ వరకు రోడ్డుకు ఇరుపక్కల  చెట్లను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి   కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరక సూర్యాపేట పట్టణంలో   విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. వనమహోత్సవం  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సూర్యాపేట జిల్లాలో పట్టణంలో  అత్యధికమైన చెట్లను నాటి ప్రకృతిని పచ్చదనంగా చేసిన ఘనత మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు దక్కుతుందని అన్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు మొక్కను నాటి దాన్ని కాపాడుతూ ఇంటి చుట్టుపక్కల ఉన్న మొక్కలకు కావాల్సిన గాలిని నీరుని పొందే విధంగా మార్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, వైస్  చైర్మన్ పుట్ట కిషోర్,  స్ధానిక కౌన్సిలర్ వెలుగు వెంకన్న,  ఆప్షన్ నెంబర్ వెంపటి సురేష్, ఇఇ జీడికే ప్రసాద్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్ వరుణ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సిహెచ్ శివప్రసాద్, ఎఫ్ ఆర్ ఓ వసుంధర, టి ఎస్ ఎం శ్వేత, సి ఓ సువర్ణ, ఆర్పీలు, సానిటేషన్ సిబ్బంది, నర్సరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333