ముదిరాజులను బీసీ డీ నుండి బీసీ ఏ గా మార్చాలి 

Jul 12, 2024 - 21:25
 0  10
ముదిరాజులను బీసీ డీ నుండి బీసీ ఏ గా మార్చాలి 

 కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన అభయస్థ హామీలను  హామీలను అమలు పరచాలి 

 ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాధర బోయిన యాదగిరి  

 సూర్యాపేట ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు ఈదుల యాదగిరి

 సూర్యాపేట :- తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజులను బిసి డి నుండి బిసి ఏ లోకి తీసుకురావాలని ముదిరాల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాధర బోయిన యాదగిరి ముదిరాజ్, సూర్యాపేట జిల్లా ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు ఈదుల యాదగిరి ముదిరాజ్ డిమాండ్ చేశారు  సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముదిరాజుల సంఘం జిల్లా అధ్యక్షులు ఈదుల యాదగిరి ఆధ్వర్యంలో  ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈనెల 15 నుండి 20వ తారీకు వరకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో వినతి పత్రాలు అందజేయాలని వారు కోరారు. అదేవిధంగా ముదిరాజులను బీసీ డీ నుండి బీసీ ఏ వరకు మార్చాలని ప్రత్యేక డిమాండ్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ముదిరాజులకు గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులో కుంటలపై ముదిరాజులకు బెస్త వారికి సంపూర్ణ హక్కులు కల్పించాలని మచ్చ పారిశ్రామిక అభివృద్ధికి 70 శాతం సబ్సిడీతో కూడినటువంటి పథకాలను మత్స్య   పారిశ్రామిక సబ్సిడీ 1000 కోట్లు ముదిరాజులకు నిధులు ఏర్పాటు చేయాలని అదేవిధంగా, 50 సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజ్ కు  పెన్షన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు అభయస్తం కింద ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యామిని వీరయ్య, జిల్లా నాయకులు ఆకుల లవకుశ, సూర్యాపేట టౌన్ మత్స్య పారిశ్రామిక  శాఖ చైర్మన్  సారగండ్ల కోటయ్య,  ముదిరాజ్ సంఘం జిల్లా యూత్ అధ్యక్షులు సారగండ్ల సురేష్, ముదిరాజ్ సంఘం టౌన్ మహిళా అధ్యక్షురాలు సారగండ్ల వెంకటమ్మ,  జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శంకర్,ఆత్మకూరు మండలం అధ్యక్షులు వీరభద్రం, పాలకవీడు  ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు చెన్నబోయిన నరసయ్య, నేరేడుచర్ల   మండల అధ్యక్షులు బుచ్చిబాబు,  ముదిరాజ్ సంఘం నాయకులు గంగారబోయిన శ్రీను, కోలా కరుణాకర్,  నల్ల మేకల వెంకన్న, పోలబోయిన సైదులు, భాష బోయిన మల్లయ్య,నాశ బోయిన వెంకటేష్ ముదిరాజ్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333