మానవత్వం చాటుకున్న అనగందుల మల్లేష్

తిరుమలగిరి 03 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల విద్యార్థులకు దాదాపు 50 భోజన ప్లేట్లను అందజేసిన ఎస్ఎం ఎలక్ట్రానిక్స్ ప్రోపరేటర్ అనగందుల మల్లేష్ ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి శాంతయ్య అనగందుల మల్లేష్ ను అభినందించారు ఎలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్ , ప్రైమరీ ప్రిన్సిపల్ అంజయ్య , ఫిజియోథెరపీ పూర్ణచందర్రావు , బిక్షపతి , రవీందర్ , వాణి , మల్లేష్ తదితరులు పాల్గొన్నారు