మాదిగల వేయి గొంతులు లక్ష డప్పుల మహాసభను విజయవంతం చేయాలి *
దర్శనం రాంబాబు
తెలంగాణ వార్త మాడుగులపల్లి ఫిబ్రవరి 1
ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరగబోయే మాదిగల వెయ్యి గొంతులు లక్ష డప్పుల మహాసభను విజయవంతం చేయడం కొరకు మిర్యాలగూడ ఎం.జి.ఎఫ్ అధ్యక్షులు దర్శనం రాంబాబు మాడుగులపల్లి మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ సారధ్యంలో 30 ఏళ్ల మాదిగల ఆత్మగౌరవ పోరాటానికి అంతిమంగా జరుగుతున్న మాదిగల వెయ్యి గొంతులు లక్ష డప్పుల మహాసభను మాదిగలందరూ ఐక్యంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఉద్యోగ సంఘాలు, జర్నలిస్టు మిత్రులు, ఎమ్మార్పీఎస్ విద్యార్థి విభాగం మండలంలో ఉన్న మాదిగ జాతి బిడ్డలంతా తమ సంకకు డప్పు వేసుకొని తప్పకుండా హాజరు కావాలని వారిని కోరారు.