మాదక ద్రవ్యాల మద్యపానం దుర్వినియోగం నివారణ పై శిక్షణ కార్యక్రమం
జోగులాంబ గద్వాల 30డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల మాదకద్రవ్యాల, మద్యపానం దుర్వినియోగం, నివారణ అనే అంశాలపై ఎస్ ఎల్ సి ఏ కోఆర్డినేటర్ శ్రీపాద సుధాకర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా సంక్షేమ అధికారి డి.సునంద ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఐడిఓ సి లోని జిల్లా కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర స్థాయి కోఆర్డినేటింగ్ ఏజెన్సీ న్యూ హోప్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మత్తు పదార్థాల పై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. యువతలో మత్తుపదార్థాల వాడకం ఎక్కువైందని, దీన్ని తగ్గించడానికి మాస్టర్ వాలంటీర్లు( నషాముక్త భారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా) స్వచ్ఛందంగా పనిచేయాలని అన్నారు మత్తుకు బానిసలు అయిన వారిని డి అడిక్షన్ కేంద్రాల్లో చేర్పించాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ లు వెంకటేశ్వరి, సుజాత కమ్యూనిటీ ఎడ్యుకేటర్ కృష్ణయ్య, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.